సరే నవల రాద్దాం అని నిశ్చయించేసుకున్నా కదా...
మరి ఇదివరకటిలాగా రెేడియో నాటకాల్లో రాసినట్టుగా సందేశాత్మకంగానో, స్పైస్ ఇండియా వ్యాసాల్లోల్లా వివరణాత్మకంగానో, లీసా ఇండియా వ్యాసాల అనువాదాల్లోలా ఖచ్చితంగానో...లేదా ప్రధమ్ ఇండియా పిల్లల పుస్తకాల్లోలా అమాయకంగానో రాస్తే సరిపోదు కదా...
నవల అన్నాక నాయిక ఉండాలి. మరి నాయిక ఉన్నాక నాయకుడూ ఉండాలి....నేను ఆ పాత్రలలోకి పరకాయ ప్రవేశం చెయ్యాలి. అసలు నేను ఎవరో నెేనే పూర్తిగా మరచిపోవాలి. మరి అంతగా నన్ను నేను కోల్పోవాలంటే లీనమయ్యేది మొక్కలలోనే కదా...
కాబట్టి ఇందులో హీరోయిన్ ఒక లత....హీరో ఒక చెట్టు ...😂😂
మరింకేం...హీరో, హీరోయిన్ ఆడిషన్ మొదలైందన్న మాట...అదేనండీ...నవలా నాయికా నాయకుల పేర్లు ఆలోచిస్తున్నా అని అర్ధం